✍️✍️ చెల్కల జితేందర్ యాదవ్, అగ్నిధార న్యూస్, మంథిని:
షరతులు లేకుండా ధాన్యం కొనాలి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.బుదవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రత్నాపూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూమిల్లర్ల తో సంబంధం లేకుండా ధాన్యం రసీదులు ఇవ్వాలని,తరుగుపేరిట రైతులను దోచుకుంటే ఊరుకోమని,తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి,అధికారంలో ఉండి దాన్యం కొనకుండా ధర్నాలు చేయడం సిగ్గుచేటు,బీజేపీ, తెరాస చీకటి ఒప్పందాలు చేసుకొని రైతులతో బతుకులతో ఆటలు ఆడుతున్నాయి అన్నారు.ధాన్యం కొనుగోలు చేసేదాకా వదలేది లేదని,ప్రభుత్వాలు రైతులు పండించి మార్కెట్లకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దాకా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ ,రామగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట చంద్రయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు అంజయ్య ,ఎస్సీ సెల్ అధ్యక్షుడు కండే పొశం, మాజీ ఎంపిటిసి వనం చందర్ రావు, రైతులు ఉన్నారు.
