అగ్నిధార న్యూస్, ధర్మారం:

కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంది మేడారం పాఠశాలలో మాస్కులు పంపిణీ.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సమక్షంలో, దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సలామోదిను హాజరయ్యారు .ఈ సందర్భంగా కొలువుల దామోదర్ యాదవ్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న సేవలకు  అభినందించారు  ఫౌండేషన్ ఇన్చార్జ్ సభ్యులు వేల్పుల నాగరాజు  మాట్లాడుతూ ఈరోజు నంది మేడారం పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు .కరోనా నియంత్రణలో భాగంగా  ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు పౌండేషన్ సభ్యులతో కలిసి మాస్కులు పంపిణీ చేసిన వారిలో.  సింగిల్విండో చైర్మన్ సమంతులు రాయమల్లు స్కూల్ చైర్మన్ శ్రీనివాస్  సమంతుల నరసింగం మాజీ సర్పంచ్ ఆవుల మల్లయ్య మేడరం యాదవ సంఘం అధ్యక్షుడు ఆవుల రాజేశం సంధినేని రాజయ్య ఆవుల రాజయ్య  మదన్ మోహన్ కొమ్మ హరీష్ తదితరులు పాల్గొన్నారు.