అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
జూలపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లెత్తుల లింగయ్యను, ఇటీవల విష సర్పము కుట్టడంతో కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయినారు. ఈ సందర్భంగా నల్ల పౌండేషన్ వ్యవస్థాపకులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి లింగయ్య ను పరామర్శించి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. లింగయ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .
