✍️✍️ చేలకల జితేందర్ యాదవ్
అగ్నిధార న్యూస్,మంథని:
గురువారం ఏఐసిసి పిలుపుమేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి అని మాజీ మంత్రివర్యులు మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపెరిగిన పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడతున్నారు,పండిచిన దాన్యాన్ని పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి,కేంద్ర ప్రభుత్వం ,రాష్ట్రప్రభుత్వంనికి వారధిగా నిలిచి రాష్ట్రం తీసుకొని కేంద్రానికి పంపించాలిని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు బాధ్యత మాది కాదు మాది కాదు అంటూ పట్టించుకోక పోవడం తో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని,ప్రభుత్వాలు చేసే పనికి అధికారులు అయోమయానికి గురవుతున్నారన్నారు.షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని,మిల్లర్ల తో సంబంధం లేకుండా ధాన్యం రసీదులు ఇవ్వాలనితరుగుపేరిట రైతులను దోచుకుంటే ఊరుకోనే ప్రసక్తే లేదని,తడిసి రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని,అధికారంలో ఉండి దాన్యం కొనకుండా ధర్నాలు చేయడం సిగ్గుచేటు,
బిజెపి, టిఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగానే దొంగ ధర్నాలు, అన్నారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూరైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలి,గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది,రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్షం మూలాన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు , అన్నారు.
రాష్ట్రం లో వరి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది అన్నారు. అనంతరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు ఈర్ల కొమురయ్య తో, కలిసి జిల్లా కలెక్టర్ శ్రీమతి సంగీత సత్యనారాయణ కి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంట రాములు యాదవ్ ప్రకాష్ రావు శ్యామ్ శ్రీనివాస్ ,రాజ్ కుమార్ తిరుపతి యాదవ్, మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ రాజు తదితరులు పాల్గొన్నారు.
