అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్:
అయ్యప్పలకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు, సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శాస్త్రి నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన, అనంతరం , మాట్లాడుతూ, అయ్యప్ప స్వాములకు భక్తి శ్రద్ధలతో గత పది సంవత్సరాలుగా నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతి నవంబర్ నుండి జనవరి వరకు అన్నదాన కార్యక్రం నడుస్తుందని అన్నారు, ఈ అన్నదాన కార్యక్రమం మాజీ సర్పంచ్ సాయిరి పద్మ మహేందర్ ఆధ్వర్యంలో పది సంవత్సరాలుగా నడుస్తున్నది అన్నారు. పెద్దపెల్లి నియోజకవర్గంలోనీ ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలోని అయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో భరత్ గురు స్వామి, మురళీ గురు స్వామి, సుల్తానాబాద్ జెడ్పిటిసి మినుపాల స్వరూప ప్రకాష్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ సమత కృష్ణ ఉమ్మడి జిల్లా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, వేముల రామ్మూర్తి ,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలక సతీష్, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్, పెద్దన్న, కుమార్ కిషోర్ ,అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు, ఇతరులు పాల్గొన్నారు.
