అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేసిన పెద్దకాల్వల సర్పంచ్ మరియు పంచాయతీ సిబ్బంది.

72వ భారత రాజ్యాంగ దినొత్సవం, పురస్కరించుకొని శుక్రవారం పెద్దకాల్వల గ్రామ సర్పంచ్ కారెంగల రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం గ్రామ స్థాయి అధికారులు మరియు ప్రజలతో కలిసి రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈకార్యక్రమాన్నీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బ్రీటీష్ వారు 200 కు పైగా సంవత్సరాలు మనల్ని పాలించిన తరువాత మనకు స్వాతంత్ర్యం లభించిందని, మన రాజ్యాంగం రచించడానికి కమిటి ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల పాటు చర్చించి నవంబర్ 26,1949న తుది రాజ్యాంగం ఆమోదించబడిందని తెలిపారు.2015 సంవత్సరం నుంచి భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రణధీర్, వార్డు సభ్యులు . గుండవేన స్వామి,గ్రామ ప్రజలు యువత తదితరులు పాల్గొన్నారు