అగ్నిధారన్యూస్, పెద్దపల్లి:

పెద్దపల్లి మండలం మూల సాల గ్రామంలో రోజులు గడిచిన పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో  కట్కూరి  సుధాకర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ పెద్దపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నెల రోజుల క్రింద కోసిన వరి ధాన్యం నేటికి కూడా కల్లాలలో కుప్పలుతెప్పలుగా పడి ఉండడం బాధాకరమన్నారు . నేడు ఏ రైతును కదిలించినా సంతోషం లేదన్నారు . ఒక దిక్కు కల్లాలలో ఉన్న వడ్లు అమ్ముడు పోలేదని బాధ మరో దిక్కు వేసంగి పంట వేయాలా వద్దా, ఏం పంటలు వేయాలని దిగులు దీనికితోడు అకాల వర్షాలు రావడం కల్లాలలో ఉన్నా వడ్లు తడిసి ముద్దవడం రైతులకు మనశ్శాంతి లేకుండా చేస్తుందన్నారు. గత నెలరోజులుగా పొద్దంతా వారి కల్లాలలో వడ్లు నేర్పడం సాయంత్రానికి కుప్ప పోయడం రైతులకు నిత్య కృత్యం అవుతుందన్నారు. కంటితుడుపు చర్యగా కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 1 లేదా 2 లారీల ధాన్యాన్ని మాత్రమే కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చినా రాజ్యం ఎప్పుడు బాగుపడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కొనుగోలు వేగవంతం చేయనట్లయితే గ్రామ రైతులుతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.