వో ల్లా ల జలంధర్ గౌడ్.                             

అగ్నిధార న్యూస్ జగిత్యాల జిల్లా

కొండగట్టు అంజన్న స్వామి ఆశీర్వాదం తో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం . ఎమ్మెల్సీ కవిత

కొండగట్టు ఆంజనేయ స్వామిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు ఆమె స్పష్టం చేశారు. రాష్టం లోని దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందన్నారు. కొండగట్టు ఆలయం కరోన సమయంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించము అన్నారు. తనను ఏకగ్రీవంగా గెలిపించిన కామారెడ్డి, నిజామాబాద్ ప్రజాప్రతినిధులకు, ముఖ్యమంత్రి కేసీఆర్  కు కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలిపారు, కొండగట్టు దేవస్థానం భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుందన్నారు రు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం యజ్ఞం నిర్వహించామని గుర్తు చేశారు .ఏ కొండ ఎక్కినా, ఏ బండ మొక్కినా రాష్ట్రం కోసమేనని కవిత తెలిపారు. దేశంలో రాష్టం ప్రతి రంగం లో నంబర్ వన్ గా ఉండాలని యాగాలు నిర్వహించామన్నారు., కొండగట్టులో చక్కటి అద్బుత నిర్మాణాలు జరుగుతున్నాయని,రామకోటి రాసి సమర్పించే వారికి రామకోటి స్దూపం నిర్మాణం జరుగుతుందన్నారు. భక్తులకు వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు.తెలంగాణ ప్రజలు సుభిక్షగా ఉండాలని కోరుకుంటూ…కవిత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపే ల్లి వినోద్ కుమార్,చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్,జగిత్యాల ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్,జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్, మున్సి పల్ ఛైర్మన్ డా: బోగ శ్రావణి ప్రవీణ్,జెడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ మరియు కౌన్సిలర్ల, కొండగట్టు దేవస్థానం డైరెక్ట్ లు, మల్యాల,కోడి మ్యల జెడ్పీపీటీసీ లు రాం మోహన్ రావు,పునుగోటి ప్రశాంతి కృష్ణ రావు,ఎంపీపీలు విమలసుదర్శన్, మేనేని స్వర్ణలత నర్సింగారావు ,అయినేని సాగర్ రావు, సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి,జాగృతి మండల కన్వీనర్ వొల్లా ల శ్రీనివాస్ గౌడ్ పార్టీ జిల్లా నాయకులు మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.