అగ్నిధార న్యూస్, మంథిని:

కామన్ పూర్ మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గాండ్ల మోహన్ మాట్లాడుతూ1827 సంవత్సరం లో జెన్మించిన మహాత్మ జ్యోతి రావు పూలె ఆనాటి సమాజంలో నిమ్న జాతులు,అణగారిన కులాలు సమాజంలో వివక్షకు గురికావడం, భారతదేశంలో అగ్రకులాలు చిన్నకులం వాళ్ళని ఎన్నోఇబ్బందులకు గురిచేయడం చూసిన జ్యోతిరావు పూలే అగ్రకులం వాళ్లకు సమానంగా అన్నీజాతుల ప్రజలకు జీవించే హక్కు ఉందని, బాల్యవివహాలు, జరుగకుండా.వితంతువులు కూడా స్వేచ్ఛగా జీవించాలని ,అందరికి విద్య అందుబాటులో ఉండాలని నిమ్న జాతుల అభివృధ్ధికోసం పోరాడిన మొదటి తరం నాయకుడు మహాత్మ జ్యోతి రావు పూలే అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూ0పల్లి రాజయ్య ,మాల్యాల తిరుపతి.యూసుఫ్ లల్లు,పెండ్యాల రాజు.అప్సర్.చిప్పకుర్తి కనకయ్య. రాయమల్లు.కృష్ణ పాల్గొన్నారు