ఘనంగా మహాత్మ పూలే వర్ధంతి
మంథని నియోజకవర్గ కేంద్రంలో మహాత్మ జ్యోతి రావు పూలే 131 వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సందర్బంగా పూలే చిత్ర పటానికి పూల మాలు వేసి నివాళులు అర్పించారు .అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతి రావు గోవిందా రావు పూలే అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం, కృషి చేసిన మహనీయులు, ప్రపంచనికి పూలే జీవితం ఆదర్శం అని, విద్య, పేదరికం ఆర్ధిక అసమానతలు నిర్ములించడానికి అహర్నిశలు కృషి చేసారని అన్నారు కార్యక్రమం లో భాజాపా రాష్ట్ర నాయకులు సునీల్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు ఎల్పుల రాజు, టౌన్ ప్రెసిడెంట్ ఎడ్ల సదా శివ, పట్టణ ప్రధాన కార్యదర్శి పబ్బ తిరుపతి,బిజెపి సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కొరబోయిన మల్లికార్జున్, కోరబోయిన రమేష్ పాల్గొన్నారు.
