చెల్కల జితేందర్ యాదవ్
అగ్నిధారన్యూస్, మంథని:
డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లకు మోక్షం ఎప్పుడు
-బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి..
నిరుపేద కుటుంబంలో ఆనందం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కు మోక్ష మెప్పుమెప్పుడని భాజాపా రాష్ట్ర నాయకులు, మంథని నియోజక వర్గ ఇంచార్జీ చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు.ఆదివారం పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధి లోని పోచమ్మ వాడ లోని డబుల్ బెడ్ రూమ్స్ ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడ నిర్మించిన 92 ఇల్లు ఎందుకు ఇప్పటికి వరకు లబ్ధిదారులకు ఇవ్వడం లేదని, నిర్మించిన ఇల్లులో ఎవరు ఉండకపోవడం తో అసాంఘికకార్యకలాపాలకు అడ్డాగ మారుతున్నాయి, నాణ్యత తో లోపం స్పష్టంగా కనిపిస్తుందని, గతం లో చంద్రుపట్ల రాంరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నపుడు పోశమ్మ వాడకు ఇచ్చిన ఫ్లాట్ లో డబుల్ బెడ్ రూమ్స్ నిర్మించిన స్థానికులకే ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారా, వచ్చే సంవత్సరం కి ఇల్లులో గృహప్రవేశం చేసేదాకా బిజెపి వీరి పక్షాన పోరాటం చేస్తుందని, హుజురాబాద్ ఎన్నికల్లో హరీష్ రావు తన నియోజకవర్గం లో నాలుగు వేల ఇల్లు నిర్మించామని గొప్పగాచెప్పుకున్నారు మరి మంథని ప్రాంతంలో ఎన్ని డబుల్ ఇచ్చారని, బీటెక్, డిగ్రీ చదివి ఈప్రాంతంలో హమాలీ పని చేసుకొనే దుస్థితి వచ్చిందని, ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు లకి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయే వరకు సమయం ఇస్తున్నమని తరువాత సంబందింత వ్యక్తులకు ఇళ్లను ఇవ్వాలని బిజెపి పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నం అన్నారు. ఈకార్యక్రమంలో మంథని టౌన్ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్, ప్రధాన కార్యదర్శి పబ్బ తిరుపతి, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కోరబోయిన మల్లికార్జున్, సబ్బాని సంతోష్, రౌతు సంతోష్,శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు….
