కాంపల్లి శంకర్ దారుణ హత్యపై.. డీజీపీకి.సిపికి ఫిర్యాదు చేస్తాం                                              పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని భయోత్పాతం సృష్టించిన కాశి పల్లి గ్రామానికి చెందిన దళితుడు డు కాంపల్లి శంకర్ ర్ అతి దారుణంగా హత్య చేసిన వారిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం. పెద్దపల్లి నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన హత్య ఫ్యాక్షన్ జిల్లాలను తలపించే విధంగా అతి దారుణంగా హత్య కాబడ్డ శంకర్ హత్య పై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. సీసీ టీవీ ఫుటేజీలను. సెల్ ఫోన్ల ను బహిర్గతం చేసి నిజాలు వెల్లడించాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరిన కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేసినట్లు ఆలిండియా అంబేద్కర్ సంఘం దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయం రామగుండం పోలీస్ కమిషనర్. పెద్దపల్లి డిసిపి. తెలంగాణ.రాష్ట్ర డీజీపీని కలిసి. ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విలేకరుల ఆలిండియా అంబేద్కర్ యువజన.సంఘం.జాతీయ ఉపాధ్యక్షులు. మామిడిపల్లి బాపయ్య. రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఉమ్మడి . కరీంనగర్. ఆదిలాబాద్ జిల్లాల. ఇన్చార్జి బొంకూరి మధు. జాతీయ కమిటీ. సభ్యులు కొంకటి.లక్ష్మణ్. జిల్లా కన్వీనర్. లంక సదయ్య తదితరులు పాల్గొన్నారు