సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఏసీపీ బాలరాజు, పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఏ ఎస్ఐ కిషన్ వాహనాల తనిఖీ చేపట్టారు.ఈ సందర్భంగా వాహనాలకు నెంబర్ ప్లేట్లు సరిగా లేనివారు, పాత చలాన్లు బకాయి ఉన్నవారు, హెల్మెట్ లేనివారికి, రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వారు, ఇన్సూరెన్స్ లేనివారికి జరిమానా విధించారు, తనిఖీ చేసి వాహనాలకు జరిమానా విధించారు. ఈసందర్భంగా ఎస్ఐ కిషన్, మాట్లాడుతూ పాత చాలాన్లు ఉన్నవారు. వెంటనే చెల్లించాలన్నారు, అలాగే ప్రతి ఒక్కరూ నెంబర్ ప్లేట్,రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు, డ్రైవింగ్ లైసెన్స్, లేని వారికి జరిమానా విధించారు.
