పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో వికలాంగుల దినోత్సవం సందర్భంగా రేయిన్ బో పౌండేషన్ అధ్యక్షురాలు నీలారపు రజిత ఆధ్వర్యంలో స్పూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో మాస్కులు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ మరో రూపంలో ప్రపంచం మీదికి దండయాత్రకు వచ్చిందని ప్రతి ఒక్కరు సామాజిక దూరం మాస్కులు దరించాలని పేర్కొన్నారు .స్పూర్తి మానసిక వికలాంగుల పరిస్థితి దయనీయంగా అన్నారు.
తన వంతుగా సహాయమందిస్తా, దాతలు కూడా ముందుకురావాలని పేర్కొన్నారు. పాఠశాలకు కంపౌండ్ లేనందున లోపలికి పాములు వస్తున్నాయని దాతలు ముందుకొచ్చి సహాయమందించాలని కోరారు.
