కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికార దాహం తప్ప ప్రజలపై ప్రేమ లేదు. రైతు పక్షపాత ప్రభుత్వాలు కాదు. నెలలు గడిచినా వరి కొనలేని దౌర్భాగ్య పరిస్థితి. రైతులకి సంకెళ్లు వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈర్ల కొమురయ్య విమర్శ. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని,పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య ధాన్యం కొనుగోళ్లలో జరగుతున్న జాప్యంపై రైతన్నలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు నెలలుగా జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు సజావుగా సాగడం లేదనీ స్థానిక ఎమ్మెల్లే వరి కొనుగోళ్ల సెంటర్లకు రిబ్బన్ కట్ చేసేందుకే పరిమితమయ్యారనీ, వరి ధాన్యం త్వరతగతిన కొనుగోలు జరిగేలా వ్యవసాయ అధికారులను అప్రమత్తం చెయ్యకపోవడo ,ఎమ్మెల్లే అలసత్వానికి, అసమర్ధతకు నిదర్శనమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికార దాహం తప్ప ప్రజా రైతాంగ సంక్షేమం పట్ల ద్యాస లేదనీ కాంగ్రెస్ ఫ్రభుత్వ హయాంలో దేశంలో రాష్ట్రంలో తడిచిన ధాన్యాన్ని ,మొలకెత్తిన మరియు రంగు మారిన ధాన్యాన్ని గింజ కటింగ్ లేకుండా కొనుగోలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది, అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో దళారులు రైతులను నిలువునా దోచుకుంటున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని చెప్పుకుంటూ రైతుల ఉసురుతీస్తున్నారని విమర్శించారు. పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు చేసే దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలంగాణ రైతులు ఉన్నారని గుర్తు చేశారు.టీఆర్ఎస్ ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతును రాజును చేస్తామని గొప్పలు చెప్పివారికి సంకెళ్లు వేసి తీవ్రవాదులుగా చిత్రీకరించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాటం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పియస్ విజయ్ కుమార్, నాయకులు వేముల రాజు, సూత్రపు పరమేశ్వర్, గోషిక రాజేష్, గుర్రాల రాజు శ్రీనివాస్ కోదాది ప్రశాంత్, నోముల మాధవ రెడ్డి, గొషిక కుమార్ తదితరులు పాల్గోన్నారు.
