కోతుల బెడద తో బెంబేలెత్తుతున్న ప్రజలు.సమస్య పరిష్కరించాలని బిజెపి నాయకుడు గుడ్ల వెంకటేష్ డిమాండ్.

సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: నిత్యం సుల్తానాబాద్ మండల కేంద్రానికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి  వేలాదిమంది వివిధ అవసరాల రీత్యా మండల కేంద్రానికి వచ్చి పోతూ ఉంటారు. పాదచారులను కోతులు నొప్పు తిప్పలు పెడుతున్నాయి. అంతేకాకుండా సుల్తానాబాద్ పట్టణంలో నివసించే ప్రజలకు చుక్కలు చూపెడుతున్న నాయి .కోతుల బెడద రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. కోతులు గుంపులు గుంపులుగా వాడలోకి ప్రవేశించి ఇంటిపై దూకడం,వాటర్ ట్యాంక్ లోకి దూకడం,ప్లంబింగ్ పైపులు పగలగొట్టడం జరుగుతుంది. వీధి వెంట తిరుగుతూ దారిపొడవునా కోతుల బెడద,ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కోతుల వీరంగాన్ని తట్టుకోలేకపోతున్నారు. పాఠశాలలకు వెళ్ళే చిన్నపిల్లలను, కూలి పనులకు వెళ్లే మహిళలకు, చేతి సంచితో ఊరు ప్రయాణాలు చేసే వారిని కోతులు ఆటంకపరచుతు ఉన్నాయి, పూసల రోడ్డులో బుధవారం రోడ్డున వెళ్తున్న ఓ మహిళపై కోతి దూకి కరిచే ప్రయత్నం చేసింది. ఆ మహిళ తప్పించుకొని ప్రమాదం నుంచి బయటపడింది.రెండు రోజుల క్రితం ద్వారక నగర్ లో కొంతమంది చిన్నారుల మీద దాడి చేసి గాయపరిచాయి. దీనివల్ల మహిళలు గడప దాటి బయటకు రావాలంటే భయపడుతున్నారు. కోతులు చెట్ల మొక్కలు పీకడం,పంటను నాశనం చేయడం, ఇంటి ముందు వస్తువులను చిందరవందర వేయడం.ఇలా ప్రతి వాడలో కోతుల స్వైర విహారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. సుల్తానాబాద్ నగర పంచాయతీ పాలకులు,అధికారులు వెంటనే స్పందించి శాశ్వతంగా కోతుల సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని గుడ్ల వెంకటేష్ ప్రజల పక్షాన డిమాండ్ చేశారు.