ఉద్యమకారుడు శ్రీకాంతాచారి కి నివాళులర్పిస్తున్న దృశ్యం . సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో సుల్తానాబాద్ లో 1500 ల రోజులుగా ఉద్యమాన్ని నడిపిన స్వర్గీయ పారుపల్లి వైకుంఠ పతి విగ్రహాన్ని సుల్తానాబాద్ లో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు, శుక్రవారం సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఎదుట తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారికి ఘనంగా కొవ్వొత్తులతో నివాళులర్పించారు, అనంతరం రవీందర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఉద్యమ కారుడిగా మంచి గుర్తింపు పొందిన వైకుంఠ పతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ప్రజా ప్రతినిధులు విస్మరించడం సరైంది కాదన్నారు, అలాగే ఉద్యమ నాయకుడు వైకుంఠ పతి మృతి చెందినప్పుడు… వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వినోద్ కుమార్ వైకుంఠపతి కుటుంబంలోని ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆ మాట నెరవేర్చ లేదన్నారు, ఆయన వెంట మాజీ మార్కెట్ చైర్మన్ ఐలయ్య యాదవ్, నాయకులు సాధ వేణి శ్రీనివాస్, ఆరెపల్లి జితేందర్, పారుపల్లి సంజయ్, ఆరేపల్లి రాహుల్ పలువురు ఉన్నారు.
