మంథని,అగ్నిధారన్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని మాజీ మంత్రివర్యులు ,మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.హైదరాబాద్ లో రోశయ్య పార్థివదేహానికి నివాళులర్పించి ,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ,ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోశయ్య గొప్ప ఆర్థిక వేత్త అని పలు మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి గా పని చేసిన ఆయన ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు,ఆయన మంత్రి వర్గం లో మంత్రి గా పని చేయడం గొప్ప అనుభవం అని అన్నారు.వారి మృతి కాంగ్రెస్ పార్టీ కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి ఎంతో లోటని పేర్కొన్నారు.