సాగు వివరాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సమీక్ష.
పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: జిల్లాలో పకడ్భందిగా సాగు విస్తీర్ణత వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం 2021 పంటకు సంబంధించి సాగు విస్తర్ణ వివరాల రికన్సిలేషన్  రిపోర్ట్ పై శనివారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో కలెక్టర్  సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 286136 ఎకరాలలో వానాకాలం పంట సాగు జరిగిందని, వీటీలో 265030 ఎకరాలకు ప్రాజేక్టులు, చెరువులు, బోర్ల కింద సాగవుతుందని,21106 ఎకరాల్లో వర్షాధారిత ఆధారంగా సాగయ్యాయని అధికారులు తెలిపారు. వానాకాలంలో 211091 ఎకరాల్లో ధాన్యం, 63274 ఎకరాల్లో పత్తి, 5508 ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు సాగు జరిగాయని వివరించారు. జిల్లాలో ఎస్ ఆర్ ఎస్ పి, లిఫ్ట్ ఇరిగేషన్ , ఇతర నీటి వనరుల కింద సాగిన భూముల వివరాలు మండలాలు , గ్రామాల వారీగా సరి చూసుకుని నివేదిక అందజేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ముఖ్య ప్రణాళిక అధికారి జె. రవీందర్, జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, గ్రౌండ్ వాటర్ అధికారి రవి శంకర్, సంబంధిత అధికారులు తదితరులు  పాల్గొన్నారు.