ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి కులభాంధవులు రావాలి : జిల్లా అధ్యక్షులు బల్ల సత్తయ్య . గోదావరిఖని,అగ్నిధారన్యూస్: తెలంగాణ ముదిరాజ్ మహాసభ రామగుండం కార్పోరేషన్ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బల్ల సత్తయ్య ముదిరాజ్, రామగుండం కార్పోరేషన్ అధ్యక్షులు జిట్టవేన ప్రశాంత్ ముదిరాజ్ హాజరై మాట్లాడుతూ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజ్ తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా ఈ నెల 8న బుధవవారం హైదరాబాద్ శాసన మండలి కార్యాలయ ఆవరణలో ప్రమాణ స్వీకారం మహోత్సవం ఏర్పాటు చేశారని, రామగుండం నియోజకవర్గం కార్పొరేషన్ పరిధి నుండి అత్యధికంగా ముదిరాజ్ కుల బాంధవులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులకు సంక్షేమం అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాలని, అపరిస్కృత ఉన్న పలు మత్స్యకారులు, ముదిరాజ్, గంగపుత్ర సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వంలో ముదిరాజులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దబ్బెట శంకర్, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి తూడి రాజయ్య, నాయకులు మేడి సదయ్య,పిట్టల అంజయ్య, బొజ్జ రాజనర్సు,రాఘవులు, బోయిని కుమార్, దండు రవీందర్,జంగపల్లి కృష్ణ, పిడుగు కుమార్, శ్రీకాంత్,అనిల్, సుధాకర్, సంపత్, సమ్మయ్య, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
