పెద్దపల్లి,అగ్నిధారన్యూస్, ఈనెల  10వ తేదీన జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో 5 నెంబర్ పోలింగ్ స్టేషన్ కేంద్రం  ఎన్నికల నిర్వహణ బందోబస్త్ గురించి పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ ఎస్ ఐ రాజేష్ ఎంపీడీవో రాజుతో తన చాంబర్లో సమీక్షి నిర్వహించారు.తదనంతరం ఎంపిడిఓ కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజు మాట్లాడుతూ తేదీ 10. 12.2021 రోజున ఉదయం 8 గంటలనుండి నాలుగు గంటల వరకు ఎన్నికలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించబడును అన్నారు . జిల్లాలోని 9 మండలాలు ఎంపీటీసీలు మరియు రామగుండం కార్పొరేషన్ పెద్దపల్లి మున్సిపాలిటీ సుల్తానాబాద్ నగర పంచాయతీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు మొత్తం కలిసి 209 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు అన్నారు.