అంబెడ్కర్  విగ్రహానికి పూల వేస్తున్న పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడార్ల శ్రీనివాస్.

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: రాజ్యాంగ నిర్మాత డా.అంబెడ్కర్  వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి బస్టాండ్ ఆవరణలో అంబెడ్కర్  విగ్రహానికి ,పెద్దపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడార్ల శ్రీనివాస్, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యావత్ మానవాళికి ఒక గొప్ప మార్గదర్శకుడు ,రాజ్యాంగం రచించి దేశ ప్రజలకు మరియు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంతో మేలు చేశారన్నారు. తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన  గొప్ప దార్శనికుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో తనతో పాటు పెద్దపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు పెర్క శ్యామ్,మైనార్టీ సెల్ స్టేట్ కన్వీనర్ ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి కట్కూరి సందీప్,పెద్దపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరగొండ రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.