కామారెడ్డి,అగ్నిధారన్యూస్: భారతదేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఆకస్మిక మరణానికి చింతిస్తూ గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన మరణం యావత్ భారతదేశానికి తీరనిలోటని అన్నారు. వారు దేశానికి చేసిన సేవలు ప్రజలు ఎప్పుడు మరిచిపోరన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ జిల్లా బాధ్యులు బాలరాజు, రాజు, అరుణ్ కుమార్ , బాన్సువాడ అధ్యక్షులు నరసింహాచారి ప్రధాన కార్యదర్శి దర్శనం శంకర్, మహేష్, గంగాధర్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ గౌడ్, కిష్టయ్య, జలంధర్ తదితర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
