పెద్దపల్లి,అగ్నిధార క్రైమ్ :పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో నిన్న రాత్రి రంగాపూర్ గ్రామ శివార్లలోని పంక్చర్ షాప్ యజమాని బిహార్ రాష్ట్రం మహువ జిల్లాకు చెందిన ముఖేష్ కుమార్ వయస్సు 35 సంవత్సరాలు హత్యకు గురయ్యాడు.అట్టి సమాచారం అందిన వెంటనే పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, బసంత్ నగర్ ఎస్ఐ మహేందర్ సంఘటన స్థలం కి వెళ్లి పరిశీలించడం జరిగింది. మృతుని సోదరుడైన సునీల్ కుమార్ S/o ఉపేందర్ పాశ్వన్, మహువా జిల్లా బీహార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,నేర దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది అని సీఐ ప్రదీప్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు .