కామారెడ్డి,అగ్నిధారన్యూస్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించారు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఆరికెల మాధవి తన భర్త సాయగౌడ్ తో కలిసి లింగంపేట మండలం లోని జల్దిపల్లి గ్రామంలో శుభకార్యానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై వస్తుండగా బీర్కుర్ మండలం అన్నారం గ్రామ సమీపంలో ఎదురుగా ఆవు రావడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై కూర్చున్న మాధవి రోడ్డుపై పడి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
