పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి పంటలపై ఊరూరా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు .ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలో పెద్దబొంకూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దస్తగిరి పల్లెలో మండల ప్రత్యేక అధికారి మైకేల్ బోస్, హాజరై యాసంగి లో వరి కి బదులుగా ఇతర ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకి అవగాహన కల్పించారు . ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి మండల వ్యవసాయ అధికారి అలివేణీ మాట్లాడుతూ యాసంగి లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు జొన్నలు, మినుములు, నువ్వులు ,పెసర, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, ఆముదం ,కుసుమ, ఆవాలు తదితర పంటలు వేయాలన్నారు. వరి దాన్యం పండించినట్లయితే ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు.
ఒకవేళ వరి పండించిన ఆ పంట కి రైతులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఆరుతడి పంటల విషయమై ఎప్పుడైనా సంబంధి ఏ ఈ ఓ లేదా ఏవో లను సంప్రదించవచ్చన్నారు . రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి కార్యదర్శి కిషోర్ బాబు,ఏ ఈ వో అర్చన రైతులు వినోద్ శ్రీనివాస్ రెడ్డి మల్లేష్ కొమురయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దస్తగిరి పల్లెకు చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డి మండల వ్యవసాయాధికారి అలివేణి తో మాట్లాడుతూ వర్షాకాలంలో పండించిన సన్నరకం వరి ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు కటింగ్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
