బహుజన  సైకిల్ సంకల్ప యాత్రకు స్వాగతం పలుకుతున్న దృశ్యం
పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాలలో బహుజన సైకిల్ సంకల్పం యాత్ర కార్యక్రమం  డిసెంబర్ 2 వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రారంభం అయి ఎలిగేడు, జులపల్లి ,సుల్తానాబాద్ , ఓదెల , కాల్వ శ్రీరాంపూర్ మండలలోని గ్రామాలు పూర్తి చేసుకొని ఈ రోజు బుధవారం రోజున సుల్తానాబాద్ మండలం రెగడిమద్ది కుంట గ్రామంలో మరల ప్రారంభమైన సైకిల్ యాత్రఉప్పరపల్లి, మూలసాల , బోజన్నపేట, మీదుగా సాగుతూ పెద్దపల్లి మండలంలోని రాంపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సైకిల్ యాత్ర కి రాంపల్లి గ్రామం లో పెద్దపల్లి జిల్లా బి ఎస్ పి పార్టీ మహిళా కన్వీనర్ సవిత బిఎస్పి పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షులు బొంకూరి దుర్గయ్య లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపెల్లి కేంద్రంలో త్వరలో జరగబోయే భారీ బహిరంగ సభకు బి ఎస్ పి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరు కాబోతున్నారు, ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.రాంపెల్లి, తో పాటు జగన్నాథ్ పూర్ మారేడుగొండ, దావన్నపల్లి గుర్రంపల్లి గ్రామాల లో యాత్ర సాగింది.ఈ సైకిల్ యాత్రలో రంజిత్, పోతార్ల సంతోష్, శ్రీకాంత్, చంద్ర శేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.