పోలింగ్ కేంద్రాలను సందర్శించి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్.
పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: ఈనెల 10వ తేదీన జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన 2 పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, బుధవారం సందర్శించారు. స్థానిక సంస్థల పోలింగ్ ను పగడదీగా నిర్వహించేందుకు, అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. పెద్దపల్లి లోని మండల పరిషత్ సమావేశ మందిరం, మంథని మండల పరిషత్  సమావేశ మందిరాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశామని తెలిపారు.పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు,పి. ఓ.లకు తగు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.    ఈకార్యక్రమంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కె.నరసింహమూర్తి, మంథని తహసీల్దార్ బండి ప్రకాష్, పెద్దపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ సేనారెడ్డి తదితరులు  పాల్గొన్నారు.