సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: సుల్తానాబాద్ మండలం మద్దికుంట అల్లిపూర్ గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన చిక్కుడు లక్ష్మణ్ ఈరోజు ఉదయం అనారోగ్య కారణాల వల్ల మరణించగా దహన సంస్కారాలకు డబ్బుల్లేక వారి కుటుంబం ఇబ్బంది పడుతుండగా స్థానిక నాయకుల సమాచారం మేరకుటిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల పౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి గారు 5,000 రూపాయల ఆర్థిక సహాయం పంపించడం జరిగింది. ఈ బాధిత కుటుంబ సభ్యులతో పాటు నల్ల మనోహర్ రెడ్డి కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
