మాదిరెడ్డి భాస్కర్ రావు జయంతి సందర్బంగా నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ.. రామగుండం,అగ్నిధారన్యూస్: గోదావరిఖని పట్టణంలో మంగళవారం రోజున మాదిరెడ్డి భాస్కర్ రావు ఇందుమతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, గోదావరిఖని ప్రాంతంలోని నిరిపేదలకు రోడ్ల ప్రక్కన జీవిస్తున్న నిరాశ్రయులకు మాదిరెడ్డి భాస్కర్ రావు ఇందుమతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భాస్కర్ రావు జయంతి సందర్బంగా ముందుగా విగ్రహానికి పులా మాల వేసి జోహార్లు అర్పించారు. అనంతరం బస్టాండ్, చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం దగ్గర, శారదా నగర తిలక్ నగర, విట్టల్ నగర్ లో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు కావ్య మాట్లాడుతూ దాదాపు పది సంవత్సరాలు నుండి విద్యార్థులకు, యువకులకు, వృద్ధులకు, యచకులకు, మరియు నిరుపేద నిరాశ్రయులకు మాదిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుండి కుటుంబ సభ్యులు మరియు ఇటీవల మృతి చెందిన మాదిరెడ్డి నాగరాజు అనేక సేవలు అందించారని పేర్కొన్నారు. మాదిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం పేదలకు కుటుంబ సభ్యుల ద్వారా సేవలు కొనసాగిస్తామని వారన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కె.కనకరాజ్, డిహెచ్పిఎస్ కార్యదర్శి ఎర్రల రాజయ్య, ట్రస్ట్ సభ్యులు మద్దెల దినేష్, రేణికుంట్ల నరేంద్ర, మనోహర్  తదితరులు పాల్గొన్నారు..