ఘనంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు                                                      జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్: కొడిమ్యాల మండల కేంద్రంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం రోజున తెరాస మండల శాఖ ఆధ్వర్యంలో ఘణంగా నిర్వహించారు.పూల మొక్కలను పండ్ల మొక్కలను నాటి కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేశారు.అనంతరం తెరాస అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం అయినందున ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి వాటిని సంరక్షించి, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సదుద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను జోగిని పల్లి సంతోష్ కుమార్ తలపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు నసీరొద్దీన్, తెరాస పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు అబ్దుల్ శుకూర్, ఆర్ బి ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేశం, ఉప సర్పంచ్ లా ఫోరం మండల అధ్యక్షుడు కొలాపురం రమేష్, నాయకులు రొడ్డ శరత్, మహంకాళి గంగరాజం, మొగిలి రాకేష్,కాయిత రాజు,చెల్ల లక్మణ్, కోలకాని సత్యం,బైరివెంకటి, ఇంత్యాజ్, చెన్న నరేందర్, శేఖర్,సాగర్,పిట్టల శ్రినివాస్,సచిన్,సుంకె నరేష్, రమేష్, మహేష్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.