పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఈనెల24 నుండి మూడు రోజుల పాటు పద్మహనుమయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలోక్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫాండషన్ అధ్యక్షులు దాసరి హనుమయ్య, కోఫౌండర్ దాసరి ఉషతెలిపారు. ఈమేరకు స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం వివరాలు ప్రకటించారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే పోటీల్లో పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి, ఎలిగేడు మండలాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు.ఈనెల 24, 25,26, సుల్తానాబాద్‌లో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. పోటీల్లో గెలుపొందినవారికి రూ.3.20 లక్షల నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు.పురుషులవిభాగంలోవాలీబాల్,కబడ్డీ,ఖోఖోమహిళల విభాగంలో త్రో బాల్,కబడ్డీ,ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.పురుషుల విభాగంలో సైక్లింగ్ 20km,రన్నింగ్ లో 5k పోటీలు ,అలాగేమహిళలకు సైక్లింగ్ 10km రన్నింగ్ 3k పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు .పోటీలలో వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు.కబడ్డీ ప్రథమ బహుమతి రూ.15వేల చొప్పున ఆరుగురికి,ద్వితీయ రూ.10వేల చొప్పున ఆరుగురికి తృతీయ రూ.5వేల చొప్పున ఆరుగురికి అందిస్తామని తెలిపారు.సైక్లింగ్ లో మొదటి స్థానం నుండి పదవ స్థానం వరకు విజేతలకు రూ.4వేల చొప్పున 10 మందికి,
11వ స్థానం నుండి 20 వ స్థానం వరకు గెలుపొందిన వారికి రూ.2వేల చొప్పున 10 మందికి,21వ స్థానం నుండి 30 వ స్థానం పొందిన విజేతలకు రూ. వెయ్యి చొప్పున బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. రన్నింగ్ లో మొదటి స్థానం నుండి 10 వ స్థానం వరకు 10మందికి రూ.4వేల చొప్పున,11వ స్థానం20 వ స్థానం వచ్చిన విజేతలకు 10 మందికి రూ.2వేల చొప్పున,21వ స్థానం నుండి 30 స్థానం వచ్చిన విజేతలకు రూ. వెయ్యి చొప్పున 10 మందికి బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.జనవరి2న పెద్దపల్లిబహుజన బిసిగర్జన సభలోఅందిస్తామన్నారు.
ఈ పోటీలలో పాల్గొనే వారు ఈనెల ల 18లోగా బీఎస్పీ పెద్దపల్లి ఆఫీస్ లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు .
మరిన్ని వివరాలకు ఈ నెంబర్లను గలరు.
దాసరి ఉష 9182057957,.సాదిక్ 9059707769,. గడ్డం శేషాద్రి 9603234050. PET శంకరయ్య 9849114956
