ప్రవేట్ ఉపాధ్యాయుడు తోట వెంకట్ గోదావరిలో దూకి ఆత్మహత్య.
సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్.
గోదావరిఖనిఅగ్నిధారన్యూస్ శనివారం రోజు గోదావరిఖని లోని గోదావరి నదిలోకి దూకి ప్రైవేట్ ఉపాధ్యాయుడు బలవన్మరణం పొందిన సంఘటన బాధాకరం,గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాల లో పి ఈ టి గా విధులు నిర్వహిస్తూ ఎలక్ట్రానిక్ మీడియా రంగం లో జర్నలిస్టుగా పనిచేస్తూ గోదావరి నది లో దూకి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఎందరో విద్యార్థులకు ఆట పాటలలో తనకున్న పరిజ్ఞానాన్ని పిల్లలకు నేర్పిస్తూ తల్లిదండ్రుల యొక్క మనసును దోచుకున్న వ్యక్తి అని,ఎన్ని కష్టాలు వచ్చిన ఆత్మహత్యలు మరెవరూ చేసుకోకూడదని, ఉపాధ్యాయుడు అంటేనే ఒక దిశానిర్దేశం చేసే ఒక మహోన్నతమైన వ్యక్తి అని, ఇలా చేసుకోవడం దురదృష్టకరమని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్ పేర్కొన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని మనో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
