కరీంనగర్ అగ్నిధార న్యూస్ ఆదివారం రోజున కరీంనగర్ పట్టణంలో  సందబోయిన ప్రసాద్ యాదవ్ అధ్యక్షతన  కరీంనగర్ పట్టణ యాదవ సంఘ సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ఆయన  మాట్లాడుతూ  యాదవులు ఐక్యంగా ఉండి సమస్యల పైన ఉద్యమించాలన్నారు. విద్యాపరంగా రాజకీయపరంగా, యాదవులకు రిజర్వేషన్లు కల్పించాలని,యాదవ నిరుద్యోగ యువతకి సబ్సిడీ లోన్లు కల్పించాలని ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రాథమిక గొర్రెల సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్నారు. సబ్సిడీ ద్వారా ఇచ్చేటువంటి రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హక్కులు సాధించుకోవాలంటే  ఐక్యంగా ఉండి, మన ఐక్యతను చాటుకోవాలని యాదవ సోదరులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా GMPS. జిల్లా కన్వీనర్ కాల్వ సురేష్ యాదవ్. యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి. జంగా కొమురయ్య యాదవ్. సభ్యులు, సందబోయిన లింగయ్య యాదవ్. .సందబోయిన సత్తయ్య యాదవ్.సందబోయిన. లక్ష్మణ్ యాదవ్.k. రవి యాదవ్. ముక్కెర ప్రణయ్ యాదవ్ . ప్రభాకర్ యాదవ్. శీలం షణ్ముఖ యాదవ్. M. శ్రీధర్ యాదవ్. జంగా సాయిబాబా యాదవ్. నల్లేంగెల. శ్రీనివాస్ యాదవ్. కొమ్మ అనిల్ యాదవ్.పాల్గొనడం జరిగింది.