పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి మండలం భోజన పేట  గ్రామ సర్పంచ్ మేకల మల్లేష్ యాదవ్ సోమవారం రోజున అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి కేంద్రంలోని పిల్లల హాజరు శాతం,గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి  పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ అవుతున్నాయా, అని అంగన్వాడి టీచర్ ని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారంతో చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం గర్భిణీలు,బాలింతలు  ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ విజయ ఉన్నారు.