ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ ప్రతి ఒక్కరు కో వాక్సిన్ తీసుకునేలా చూడాలి.MPP మెన్నేని స్వర్ణలత.
జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్ : జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని M.P.P మెన్నెని స్వర్ణలత రాజనర్సింగరావు ఆకస్మికంగా తనికి చేసి పరిశీలించారు . ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ. కరోన వైరస్ నుండి ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలందరూ ఎప్పుడైనా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. కొడిమ్యాల మండలంలోని అన్ని గ్రామాలలో 100% కరోన వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చిన పెసెంట్స్ కి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు.ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లోని మౌలిక వసతుల వివరాలను అడిగి తెలుకున్నారు. ఈ కార్యక్రమంలో vice M.P.P పర్లపెల్లి ప్రసాద్ డాక్టర్ రమేశ్, సూపర్వైజర్ విజయలక్ష్మి సిబ్బంది సుదర్శన్,విష్ణు వర్ధన్, స్టాఫ్ నర్స్ పులా, తదితరులు పాల్గొన్నారు.
