పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణం సోమవారం సాయంత్రం కునారం రైల్వే గేట్ వద్ద త్రుటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం.టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు ఆటోలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడమే కాకుండా రెండు ఆటోలు దెబ్బతిన్నాయి .వివరాల్లోకి వెళితే పెద్దపల్లి నుండి కాల్వ శ్రీరాంపూర్ కు ప్రయాణికులతో వెళుతున్న హనుమంతుని పేటకు చెందిన సలిగంటి శ్రీనివాస్ ఆటో( మరియొక ఆటో) వెళుతున్నారు. ఆ సమయంలో ఇటుక బట్టీలకు సంబంధించిన టిప్పర్ రాంపల్లి కి వెళుతున్న క్రమంలో కూనారం రైల్వే గేటు వద్ద ఆగి ఉన్నది. ఆ వెనకాలే ప్రయాణికులతో వస్తున్న ఈ రెండు ఆటోలు ఇటుక బట్టీల టిప్పర్ కు కొద్ది దూరంలో నిలుపుదల చేశారు.ట్రైన్ వెళ్లిపోయాక ముందుకు వెళ్లాల్సిన టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఒక్కసారిగా వెనక్కి వచ్చి ఆటోలను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆటోలు రెండు ధ్వంసం అయ్యాయి, తోటి ప్రయాణికుల సహాయంతో బాధితులను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని స్థానికులు తెలిపారు.
