తెరాస పార్టీ సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల MLC ఎన్నికలలో విజయం సాధించాము.
సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగారావు జగిత్యాల,అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల MLC ఎన్నికల లో 6 స్థానాలకు 6 స్థానాలు తెరాస అభ్యర్థులు గెలుపొందినందుకు కొడిమ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ లో కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగారావు ఆధ్వర్యంలో తెరాస మండల శ్రేణులు బాణాసంచా పేల్చి, స్వీట్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వల్లనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో పయనిస్తున్న విషయం గమనించిన గౌరవ ఎంపీపీలు, జెడ్ పి టి సి లు, కార్పోరేటర్స్, కౌన్సిలర్స్ Mptc లు తెరాసMLC అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించడం జరిగిందన్నారు.వైస్ MPP పర్లపెల్లి ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ MLC లు గా L.రమణ,భానుప్రసాద్ రావు లు విజయం సాధించడంతో పార్టీ నూతనోత్సాహం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, MPTCలు ఊట్కూరి మల్లారెడ్డి, బసవవేని మహేష్, సామల లక్ష్మణ్, కో ఆప్షన్ సభ్యులు నసీరొద్దీన్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నేరళ్ల మహేష్, ఉపాధ్యక్షుడు రొడ్డ శరత్, చీకట్ల మహేష్, తిరుమలేష్,గుండు రాజు తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు, చెల్ల లక్ష్మణ్, కోలకాని సత్యం, మొర్రి అశోక్, నాయకులు గడ్డం చంద్రమోహన్ రెడ్డి , బైరి వెంకటి, మొగిలి పాలెం శ్రీనివాస్ , నరేష్ గౌడ్,దీకొండ చంద్రశేఖర్, వీర బత్తిని రాజు, రాకేష్, ఇంత్యాజ్, తదితరులు పాల్గొన్నారు.
