పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల. కొమురయ్య అధ్వర్యంలో పెద్దపెల్లి కేంద్రంలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు,పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జీ జి.నిరంజన్, హాజరై స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో గెలిచిన తర్వాత విజయ్ దివాస్ గా భారతదేశంలో ఏటా డిసెంబర్ 16వ తేదీన జరుపుకుంటున్నమని అన్నారు. 1971లో భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించిందనీ, పాకిస్థాన్ అధీనంలో ఉన్న బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ యుద్ధం ప్రారంభమైందనీ, భారత సైన్యం యొక్క వీరోచితపోరాటం వల్లనే ఈ యుద్ధంలో పాక్ తోక ముడిచిందనీఎట్టకేలకు బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ నుంచి విముక్తి లభించిందనీ అన్నారు.బంగ్లాదేశ్ ఒక దేశంగా ఆవిర్భవించిందంటే ఆనాటి ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ధైర్యం దృఢ సంకల్పం కార్యదీక్ష కారణమని స్థితిస్థాపకత కోసం కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిందని, భారతదేశపు మొదటి మహిళా ప్రభుత్వాధినేతగా మొత్తం ప్రజలను చైతన్యవంతం చేసిందని ఈ యుద్ధంలో పాక్ ఆర్మీ భారత్‌కు దాసోహం కావడమే కాకుండా నాడు తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడే బంగ్లాదేశ్‌కు విముక్తి కలిగిందనీ ఆమెను మేము గర్వంగా స్మరించు కుంటున్నామని అన్నారు.డిసెంబర్ 16వ తేదీ బంగ్లాదేశ్‌కు కూడా ఒక పండగ దినంగా ప్రజలందరు జరుపుకుంటారని పాకిస్తాన్ అధీనం నుంచి స్వతంత్రదేశంగా తూర్పు పాకిస్తాన్ ఆవిర్భవించి తర్వాత బంగ్లాదేశ్‌గా రూపాంతరం చెందిందనీ అన్నారు అదే సమయంలో పాకిస్తాన్‌ను దెబ్బతీయడంలో భారత్ సత్తా చాటిందని ఈ విజయాన్ని భారత్ ఇప్పటికీ గర్వంగా చాటుకుంటుందనీ రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత తొలి యుద్ధం ఇదే కావడం ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించడం అనేవి చరిత్రలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయాయనీ అన్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుంచుకోవాలని ఆనాడు యుద్ధంలో త్యాగాలను గుర్తు చేసుకుంటూ,పాకిస్తాన్ చెర నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించే క్రమంలో పాక్ పై పోరాడి అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కల్వల శ్రీనివాస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు భూషణ వేణి సురేష్ గౌడ్ మండలఅద్యక్షులు సేగ్గెం రాజేష్ ,రాజయ్య, తోట చంద్రయ్య, దొడ్డే బాలాజీ,జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ జిల్లా కార్యదర్శి పి యస్ విజయ్ కుమార్ కిరణ్ గౌడ్ ప్రశాంత్ రాజ్ తది తరులు పాల్గోన్నారు.
