పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఓదెల గ్రామానికి చెందిన భీరం కుమారస్వామి ఇటీవలే కరోనా తో మృతి చెందారు. భీరం కుమారస్వామి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో గత 8 నెలల క్రితం ఏజెంట్ కానికిరెడ్డి సూర్యనారాయణ ద్వారా సంవత్సరనికి 42,000( ఒక్క కిస్తీ మాత్రమే కట్టడం జరిగింది ) చొప్పున పాలసీ నీ తీసుకోవడం జరిగింది. ఇట్టి పాలసీ గాను సహజ మరణం కింద శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 4,91,000 రూపాయల చెక్ ను కుమారస్వామి యొక్క భార్య కవిత కు గురువారం రోజున అందజేయ్యడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో శ్రీరామ్ ఏజెంట్స్ , కోమిరే ఎంపీటీసీ సరోజన -కిసాన్ రెడ్డి అబ్బీడి పల్లి సర్పంచ్, ఒజ్జా కోమలత – శ్రీనివాస్, డెవలప్ మెంట్ ఆఫీసర్ కర్రే కుమారస్వామి, కొప్పుల రవీందర్,మ్యాడగొని శ్రీకాంత్,సూర్యనారాయణ, కర్ణాల నారాయణ,శ్రీరామ్ లైఫ్ ఎక్సక్యూటివ్ డైరెక్టర్, శ్రీనివాస్ రెడ్డి , రిజినల్ మేనేజర్ సురేష్ , డివిజనల్ మేనేజర్ సతీష్ చందా ఏరియా మేనేజర్స్, గుర్రం శివ, సయ్యద్ చంద్ శ్రీరామ్ ఎక్స్యూటివ్స్ అనిల్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
