సుల్తానాబాద్,అగ్నిధారన్యూస్: నిన్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో సుల్తానాబాద్ లోని శ్రీవాణి జూనియర్ కళాశాల విజయ దుందుభి మోగించింది. MPCగ్రూప్ లో వల్లెపు గణేష్ 465/470 స్టేట్ 3rd ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా బైరగోని వైష్ణవి 459/470 మార్కులు సాధించడం జరిగింది. CEC విభాగంలో JAVERIA 464/500 మార్కులు సాధించడం జరిగింది .అదే గ్రూపులో బోడ అంకిత 462/500 మార్కులు సాధించింది. BiPC విభాగంలో LIMRA SANIA 395/440 మార్కులు, సిద్ది నవ్యశ్రీ 374/440 మార్కులు సాధించారు. ఇంతటి ఘన విజయం అందించిన అధ్యాపక బృందానికి, ఘన విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు, తల్లిదండ్రులకు శ్రీవాణి కళాశాల కరస్పాండెంట్ శ్రీ రేకులపల్లి శశాంక శుభాకాంక్షలు తెలియజేశారు. COVID సమయంలో ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకారం విద్యను కొనసాగించడం వల్లే స్టేట్ 3rd ర్యాంక్ సాదించగలిగామని, విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకొని భవిషత్తులో మంచి ఉన్నత విద్యను అభ్యసించాలని తెలియజేసారు. అనంతరం బాణా సంచా కాల్చి స్వీట్స్ పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలు, బండారి కమలాకర్, ఆరెపల్లి మధు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
