శ్రీరాంపూర్ ZPTC వంగల తిరుపతి రెడ్డి పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: . ఈ రోజు పెద్దపల్లిలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ ZPTC వంగల తిరుపతి రెడ్డి, పెద్దపల్లి మునిసిపల్ TRS పార్టీ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ లు మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు కల్పిస్తామని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కాంట్రాక్టు లేబర్ ల దగ్గర మంత్రి డబ్బులు తీసుకున్నారనే,పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ మాట్లాడారు . నిజ నిరూపణ జరిపించి, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారి పేర్లు బయట పెడితే మా మంత్రిగారే వారి పైన చర్యలు తీసుకుంటారన్నారు. నిజాలు తెలుసుకోకుండా మంత్రిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని. సీనియర్ నాయకులైన గొనె ప్రకాష్ రావుకు సంబంధం లేని దానిలో మంత్రి పేరును వాడడం, మీ స్థాయిని మీరే దిగజార్చుకున్నట్లు కనబడుతోంది అన్నారు. నిజాలుకానీ, తప్పుడు ఆరోపణలు మరొక సారి మామంత్రి పై గాని, మా TRS నాయకులపై గాని మాట్లాడితే తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.మంత్రి పై చేసిన వ్యాఖ్యలని వాపస్ తీసుకుని, నీ వద్ద నిజమైన ఆధారాలు ఉంటే బాధితులు ఉంటే చెప్పాలి. అన్నారు.అను నిత్యం బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటూ, ప్రజా సేవే లక్ష్యంగా, ప్రజల కోసం పనిచేస్తున్న సంక్షేమ శాఖ మాత్యులు, శ్రీ కొప్పుల ఈశ్వర్ పై తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదు. ఇటువంటి ఆరోపణలు ఇకముందు చేస్తే తగిన విధంగా TRS శ్రేణులు గొనె ప్రకాష్ రావు కు బుద్ధి చెపుతాయని హెచ్చరించారు.ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో TRS నాయకులు మోబిన్, భిక్షపతి, ఆశ్రఫ్, జాకీర్ హుస్సేన్,గండు రంగయ్య, ఫహీం, ఇబ్రహీం, శ్రీకాంత్, ఖాదర్, మధులు పాల్గొన్నారు.
