పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: శుక్రవారం రోజు పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ఆదేశాల మేరకుట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్ తన సిబ్బందితో, కలిసి బస్టాండ్ ఏరియాలో వాహన తనిఖీ కార్యక్రమం చేపట్టారు. వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పెండింగ్ చాలన్స్ పైన అవగాహన కల్పించారు. పెద్దపల్లి పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ రీత్యా వాహనాలు నడుపుతున్న సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ బండి రిజిస్ట్రేషన్ హెల్మెట్ అన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. త్రిబుల్ రైడింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. స్థానిక బస్ స్టాండ్ ఏరియా ఆటో డ్రైవర్లకు ప్రయాణికులను తీసుకు వెళుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను, స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ సంపత్ సిబ్బంది పాల్గొన్నారు.
