బ్రాహ్మణ పల్లి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ.
పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు. గ్రామ టి. అర్.ఎస్. రాష్ట్ర నాయకులు పడాల స్వామి 5000 రూపాయలు విలువచేసే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ సబ్జెక్ట్ పుస్తకాలు.40 మంది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి ఇష్టంగా చదువుతూ ఉన్నత శిఖరాలను అవరోహించాలి అన్నారు. పాఠశాల ఇంఛార్జి hm పో రెడ్డి దామోదర్ రెడ్డి. గ్రామ సర్పంచ్ జి మల్లేశం పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ ను ఉపయోగించి రాబోవు పదవ తరగతి పరక్షల్లో మంచి మార్కులు సాధించాలి , అన్నారు . విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేసిన పడాల స్వామి అభినందనీయులు అన్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ.smt. నిరుమల శ్రీనివాస్. విద్యకమిటి చైర్మన్ పి.రామస్వామి. కే. విజయ భాస్కర్. ఏ. కుమాస్వామి. డి. కుమారస్వామి. గ్రేస్ నిరీక్షణ.రూప. తిరుమల. ఈ.రవీందర్. తదితరులు పాల్గొన్నారు.
