పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: ఈ నెల 25 క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ కానుకలను పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి క్రైస్తవ సోదరి సోదరులకు పెద్దపల్లి పట్టణంలోని MS గార్డెన్ లోపంపిణీ చేశారు.
.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వ మతాల, సాంప్రదాయాలను సంస్కృతులను గౌరవిస్తూ ఆయా పండుగలకు మీ బిడ్డగా కానుకలు అందించడం జరుగుతుందన్నారు. పండుగ రోజున అందరూ వైభవంగా ఆనందోత్సవాల మధ్య వేడుకలు జరుపుకోవాలనేది శాసనసభ్యుడిగా నాఆకాంక్ష అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను తమ ప్రభుత్వం ఆధరిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం క్రైస్తవ సోదరులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి,ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, పట్టణాధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, కౌన్సిలర్ భిక్షపతి, తహసిల్దార్ శ్రీనివాస్, RI లు భవానీప్రసాద్ వరలక్ష్మీ రెవెన్యూ సిబ్బంది,ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
