పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: మంగళవారం రోజున పెద్దపెల్లి జిల్లా లోని పెద్దపల్లి పట్టణం అమర్ చంద్ కళ్యాణమండపంలో రెండురోజుల శిక్షణ తరగతులకు ముఖ్యఅతిదిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు ముందుగా పార్టీ జండా అవిస్కరించారు. అనంతరం అయిన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ మొండి పాలన కొనసాగుతుందని దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతూ దేశాన్ని అదోగతి పాలు చేస్తున్నాడని జీవిత భీమా, రైల్వే, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఫోర్స్, చివరికి రక్షణ రంగాన్ని మరియు ఇంకా ఇతర సంస్థలను ప్రయివేటి పరం చేయడం దుర్మార్గం అని అయిన తీవ్రంగా విమర్శించారు. అదే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తూ నియంత పాలన కొనసాగిస్తున్నారని, ఒక వైపు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరో వైపు రైతు ధర్నాల పేరుతో దొంగ నటకాలు ఆడుతున్నారని అయిన తీవ్రంగా ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కేంద్రంలోని మోడీకి రాష్ట్రంలో కెసిఆర్ కి సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయి అన్నారు. పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై ప్రజాపోరాటాలు మరింత ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కలెవెన శంకర్ మర్రి వెంకట స్వామి, వాసిరెడ్డి సీత రామయ్య, వేల్పుల నారాయణ సిపిఐ వివిధ జిల్లాల కార్యదర్శులు పెద్డపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, నిర్మల్ జిల్లా కార్యదర్శి ఎస్. విలాస్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి పోనగంటి కెదారి, సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు, రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, కె.కనక రాజ్, మద్దెల దినేష్, తలపెళ్లి లక్ష్మణ్ చంద్రగిరి ఉదయ్ కుమార్, అరేపెళ్లి మానస్ కుమార్, బాలసాని లెనిన్, ఇదునూరి ప్రేమ్ కుమార్, టి.రమేష్ కుమార్, శంకర్, అంజి మేకల దాస్, కడారి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
