నిషేధిత ఉత్పత్తులు రవాణా చేస్తే కఠిన చర్యలు  ఏసిపి సారంగపాణి. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:పెద్దపల్లి సబ్ డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోఅక్రమ రవాణా నియంత్రణకు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి సబ్ డివిజన్ పరిధిలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, బసంతనగర్, కాల్వ శ్రీరాంపూర్, పోత్క పల్లి, జూలపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. బ్రీత్ ఆనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించి మద్యం సేవించిన వారి వాహనాలను   సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేశారు.          ఈసందర్భంగా ఏసిపి సారంగపాణి మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి గుట్కాతో పాటు నిషేధిత ఉత్పత్తుల అక్రమ రవాణానుఅడ్డుకునేందుకు తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. నిషేధిత ఉత్పత్తులను ఎవరు రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవన్నారు. తనిఖీల్లో సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు ఉపేందర్ రావు, రాజ వర్ధన్, మహేందర్, శ్రీనివాస్, జానీ పాషా, లక్ష్మణ్, వెంకటేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.