ముదిరాజులను రాజులుగా చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్.
జగిత్యాల,అగ్నిధారన్యూస్: కొడిమ్యాల మండల కేంద్రంలోని ముదిరాజ్ కుల సంఘ భవనం కొరకు MLC కోటా నుండి బండ ప్రకాష్ ముదిరాజ్ కేటాయించగా చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ బుధవారం రోజున భూమి పూజ చేశారు.అనంతరం ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మాట్లాడుతూ ముదిరాజులను రాజుల చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ముదిరాజ్ కులస్తుల అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రభుత్వం , రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేక పథకాలను ప్రవేశపెట్టారు.మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో నీళ్లు నుండి, చెరువులో చేప పిల్లలను వేసి, చేపలు పట్టడానికి వలల నిచ్చి , ద్విచక్ర వాహనాలనిచ్చి,గూడ్స్ బండ్లు, DCM వ్యాన్ లనిచ్చి , మత్స్యకారులను , ముదిరాజులను రాజులను గా చేస్తూ, సంఘ భవనాల కొరకు నిధులను కేటాయిస్తున్నామని అన్నారు.సంఘ భవనం నిర్మాణం కొరకు మరిన్ని నిధులను కేటాయిస్తానని ఎమ్మెల్యే ముదిరాజ్ సభ్యులకు హామీ ఇచ్చారు.అనంతరం ముదిరాజ్ కుల సంఘ సభ్యులు అందరూ ఎమ్మెల్యే రవిశంకర్ గారిని షాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. కొడిమ్యాల గౌడ సంఘం వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పూజలు నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే రవిశంకర్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ని దర్శించుకున్నారు.గౌడ సంఘం వారు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సింగిల్విండో చైర్మన్ మేని రాజ నర్సింగరావు, సర్పంచ్ ఏలేటి మమత నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, MPTC లు సామల లక్ష్మణ్, బసన వేణి మహేష్, ఊట్కూరి మల్లారెడ్డి, తె రా స మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు రొడ్డ శరత్,SC సెల్ మండల అధ్యక్షుడు నేరెల్ల మహేష్,కోలాపురం రమేష్, గుండు రాజు,బైరి రాద వెంకటి,తిరుమలేష్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర సమన్వయకర్త బల్ల నర్సయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు బల్ల పోచ మల్లు నాయకులు లక్ష్మీ నర్సయ్య,చొక్కాల ప్రభాకర్, తిరుపతి, కోలకాని సత్యం, మొర్రి అశోక్, రాజేశం,గౌడ్ సంఘం నాయకులు చిలువేరి,నారాయణ గౌడ్, పురుషోత్తం పరుశరాములు గౌడ్, గుర్రం లక్ష్మణ్ గౌడ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
