పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:పెద్దపల్లిజిల్లాకేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద గత 22 రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశలో పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ చూపాలని జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరిశ్రీమన్నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం రోజున మధ్యాహ్నభోజన కార్మికుల నిరసనదీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా తాడూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె చేయడం వల్ల విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పడిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యల పరిష్కారంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధులు వారి న్యాయపరమైన కోర్కెలను జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దీక్షా శిబిరం ముందు నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్న   ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శిబిరాన్ని సందర్శించకపోవడం  శోషనీయం అన్నారు. గ్రామాలలో సర్పంచులు ఈ సమస్య పట్ల బాధ్యతగా స్పందించి పంచాయతీ తీర్మానం   చేసి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి పంపాలని ఆయన కోరారు .అలాగే మండల పరిషత్ లో మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తీర్మానాన్ని కోరుతూ జిల్లా పరిషత్ స్థాయిలో కూడా తీర్మానాలు చేయాలన్నారు. చేసిన తీర్మానాలుప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తే అప్పుడే సమస్యకు పరిష్కారం లభించి పేద విద్యార్థులకు విద్య లభ్యమవుతుందని అన్నారు. రాజ్యాంగంలో విద్య ప్రాథమిక హక్కుగా పొందుపరిచిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే అసమానతలు పెరిగి సమాజంలో అశాంతి పెరిగిపోతుంది అని అన్నారు. కార్మికులకు  వంటా-వార్పు కింద నెలకు 11 వేల రూపాయలు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే విధంగా వంట సామాగ్రి తో పాటు కోడిగుడ్లు ఉచితంగా అందించాలని కోరారు. ప్రభుత్వ పరంగా గ్యాస్ సరఫరా చేసి వంట వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు .మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. శిబిరాన్ని సందర్శించిన వారిలో పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు సత్యనారాయణ  శేఖర్ లు ఉన్నారు.