జగిత్యాల అగ్ని ధార న్యూస్: అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ పంపిణీ , ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వం లక్షం..ఎమ్మెల్యే సుంకె రవి శంకర్.                కొడిమ్యాల మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం రోజున చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ 62 మంది అంగన్వాడీ టీచర్లకు సాంసంగ్ గెలాక్సీ mo2 స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. అనంతరం 9 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తొమ్మిది లక్షల ఒక వెయ్యి నలబై నాలుగు రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.తదనంతరం క్రిస్టమస్ సోదరీమణులకు క్రిస్మస్ కానుకగా దుస్తుల పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లును కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదని కేవలం అంగన్వాడీ కార్యకర్త గానే చూశారన్నారు.తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీ టీచర్లు గా గుర్తించి వారికి వేతనం పెంచి వారి పనితీరు మరింత వేగంగా సులభంగా కావాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్ లో పంపిణీ చేయడం జరిగిందన్నారు.కళ్యాణ లక్ష్మి పథకం అనే పథకం గత 70 సంవత్సరాలు పరిపాలిస్తున్న ఏ ప్రభుత్వాలు కూడా కల్యాణ లక్ష్మి లాంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారు లేదన్నారు.ఉద్యమ సమయంలో ములుగు జిల్లా లోని తండా గ్రామం లో కీమానాయక్ అనే వ్యక్తి కుమార్తె వివాహం కోసం పొలం అమ్మి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు జమ చేసుకొని రెండు రోజుల్లో పెళ్లి ఉంది అనే సమయంలో దురదృష్టవశాత్తూ ఆ ఇంటికి నిప్పంట్టుకొని డబ్బు బంగారం వస్తువులు అన్నీ కాలి బూడిదయ్యాయి. ఆనాడు  కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు ఉద్యమ నేతగా చలించి ములుగు జిల్లా లోని తండా గ్రామానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి పెళ్లి ఖర్చులన్నీ భరించి తానే దగ్గరుండి స్వయంగా పెళ్ళి జరిపించి వచ్చాడు.ఆ రోజే కెసిఆర్ మదిలో పుట్టింది కల్యాణ లక్ష్మి. ప్రతి పేదింటి ఆడబిడ్డలు పెళ్లి ఖర్చులకు ఇబ్బందులు పాల్పడవద్దని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టారని అన్నారు.క్రిస్టియన్ సోదరీమణులకు క్రిస్మస్ కానుకగా బట్టలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు.ఈ కార్యక్రమంలో MRO స్వర్ణ, కొడిమ్యాల సింగిల్విండో చైర్మన్ మేని రాజ నర్సింగారావు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పొనుగోటి కృష్ణారావు, వైస్Mpp పర్లపల్లి ప్రసాద్, MPTCలు సామల లక్ష్మణ్, ఊట్కూరి మల్లారెడ్డి, బసవవేనిమహేష్,తెరాసమండల   అధ్యక్షులు పులి వెంకటేష్, ఉపాధ్యక్షులు రొడ్డ శరత్,scసెల్ మండల అధ్యక్షులు నేరెళ్ళ మహేష్, నాయకులు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, కొత్తురి స్వామి,బైరి వెంకటి,గుండు రాజు,కోలాపురం రమేష్, అశోక్, దేవయ్య,తిరుమలేశ్, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.